హైదరాబాద్: 28°C
క్రీడలు

BCCI శతజయంతికి క్రేజీ మ్యాచ్‌ ప్లాన్‌?

క్రికెట్ చరిత్రలోనే క్రేజీ మ్యాచ్‌కు BCCI ప్లాన్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. BCCI 100వ వార్షికోత్సవం సందర్భంగా టీమిండియా-రెస్టాఫ్‌ ఇండియా మధ్య మ్యాచ్‌ నిర్వహించే యోచనలో ఉన్నట్లు సమాచారం. సెప్టెంబర్‌ 25న జరిగే ఏజీఎంలో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 2027 డిసెంబర్‌ నుంచి 2028 వరకు శతాబ్ది వేడుకలు నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది.