హైదరాబాద్: 28°C
తెలంగాణ

అభివృద్ధి కార్యక్రమాలపై ఎమ్మెల్యే సమీక్ష

NGKL: అచ్చంపేట మండల కేంద్రంలో ఎమ్మెల్యే డాక్టర్‌ వంశీకృష్ణ సమక్షంలో సర్వసభ్య సమీక్ష సమావేశం బుధవారం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ..మండలంలో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ప్రజలకు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు.