హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అధ్వానంగా మారిన రోడ్డు

NLR: మర్రిపాడు మండలంలోని చాబోలు‌కు వెళ్లే R AND B రహదారి అధ్వానంగా మారడంతో స్థానిక ప్రయాణికులు వాహనదారులు కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారిపై పలుచోట్ల గుంతలు ఏర్పడి, రాక పోకలకు ఆటంకంగా మారాయి. ద్విచక్ర వాహనదారులు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.