హైదరాబాద్: 28°C
తెలంగాణ

'అంబేద్కర్ భవనానికి నిధులు మంజూరు చేయాలి'

నిర్మల్ పట్టణంలోని అంబేద్కర్ భవనంలో సౌకర్యాల కల్పనకు రూ.30 లక్షలు మంజూరు చేస్తామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హామీ ఇచ్చారని కాంగ్రెస్ నియోజకవర్గ బాధ్యుడు కుచాడి శ్రీహరిరావు తెలిపారు. హైదరాబాద్‌లో మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. భవనంలో ప్రతిధ్వని నివారణ, కుర్చీలు, ఇతర సౌకర్యాలతో పాటు స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలని తెలిపారు.