హైదరాబాద్: 28°C
తెలంగాణ

గంజాయితో పట్టుబడ్డ సినిమాటోగ్రాఫర్

HYD: జూబ్లీహిల్స్ రోడ్ నం.13లోని హోటల్ లోటస్ గ్రాండ్‌లో పోలీసులు జరిపిన తనిఖీల్లో గంజాయి పట్టుబడింది. చెన్నైకి చెందిన సినిమాటోగ్రాఫర్ ఆర్.ఆదిత్య కృష్ణన్(28) వద్ద నుంచి 3.8 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి వినియోగించినట్లు ఆదిత్యకృష్ణన్ అంగీకరించాడని, అతడు డీ-అడిక్షన్ చికిత్స పొందేందుకు సిద్ధంగా ఉన్నాడని జూబ్లీహిల్స్ పోలీసులు వెల్లడించారు.