హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: అయ్యప్ప స్వామి ఆలయంలో గోపూజ

PDPL: ధర్మారంలోని హరిహరసుత శ్రీ అయ్యప్ప స్వామి గోశాల ట్రస్ట్ మరియు ఆలయంలో ఇవాళ గోపూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు గోమాతను అలంకరించి, భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. గోమాతను పూజిస్తే సకల పాపాలు తొలగిపోయి, పుణ్యం కలుగుతుందని ఆలయ పురోహితులు నర్సింగరావు తెలిపారు. పూజ అనంతరం భక్తులకు ఆశీర్వచనంతో పాటు తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు.