హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఎస్సీ, బీసీ హాస్టళ్ల సమస్యలు పరిష్కరించాలి'

KRNL: ఎమ్మిగనూరులో ఎస్సీ హాస్టల్ ఏర్పాటు చేయడంతో పాటు బీసీ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని ఇవాళ విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో సమస్యల పరిష్కారం కోరిన తమపై కేసులు పెట్టారని, ఇప్పటికీ కోర్టు వాయిదాలకు హాజరవుతున్నామని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం స్పందించి హాస్టళ్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు.