హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: వర్షాలతో బోసిపోయిన కించుమండ వారపు సంత

ASR: తుఫాన్‌ ప్రభావంతో కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలతో డుంబ్రిగూడ మండలం కించుమండలో ఇవాళ నిర్వహించిన వారపు సంత బోసిపోయింది. సాధారణంగా మండలంలోని వివిధ గ్రామాల నుంచి గిరిజనులు పెద్ద సంఖ్యలో సంతకు వచ్చి నిత్యావసర వస్తువులు, కూరగాయలు కొనుగోలు చేస్తుంటారు. అయితే భారీ వర్షాల కారణంగా మారుమూల గ్రామాల ప్రజలు ఇళ్లకే పరిమితం కావడంతో సంతకు జనసంచారం తగ్గింది.