హైదరాబాద్: 28°C
తెలంగాణ

పంచాయతీల్లో ఎంపీఓ ఆకస్మిక తనిఖీలు

నిర్మల్ మండలంలోని ఎల్లారెడ్డిపేట, నీలాయిపేట్ గ్రామపంచాయతీలను ఈరోజు ఎంపీఓ శ్రీనివాస్ సందర్శించారు. ఈ సందర్భంగా పంచాయతీ రికార్డులను పరిశీలించి, పన్నుల వసూళ్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలో పర్యటించి పారిశుధ్య, శానిటైజేషన్ పనులను పరిశీలించి, సిబ్బందికి తగిన సూచనలు చేశారు.