హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలి: ఎమ్మెల్యే

ఏలూరు: మూడు రోజుల పాటు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ సూచించారు. కొల్లేరు వరద ముప్పు ప్రాంతాలను గుర్తించి అధికారులు ముందస్తు రక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు.