హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొత్తపేటలో పింఛన్ దరఖాస్తుల ఫీల్డ్ వెరిఫికేషన్

SDPT: జగదేవ్‌పూర్ మండలం కొత్తపేట గ్రామంలో నూతన పింఛన్ దరఖాస్తులపై ఫీల్డ్ వెరిఫికేషన్ నిర్వహించారు. స్పెషల్ ఆఫీసర్ సమత ఆధ్వర్యంలో దరఖాస్తుదారుల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అర్హులైన వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా పారదర్శకంగా పరిశీలన చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జ్యోతి మహేష్, ఉపసర్పంచ్ అమరేందర్ రెడ్డి పాల్గొన్నారు.