హైదరాబాద్: 28°C
తెలంగాణ

వినయ్ భాస్కర్‌పై దాడిని ఖండిస్తున్నాం: బీఆర్‌ఎస్

HNK: మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్‌పై ఎంజీఎం ఆసుపత్రిలో జరిగిన దాడిని ఖండిస్తున్నట్లు బీఆర్‌ఎస్ నాయకుడు రంజిత్‌రెడ్డి బుధవారం తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి 20 మంది బీఆర్‌ఎస్ నాయకులపై కేసులు నమోదు చేయడం దారుణమని అన్నారు. రాజకీయ కక్షతోనే కేసులు నమోదు చేశారని ఆరోపించారు. నాయకులపై నమోదైన కేసులను వెంటనే ఉపసంహరించుకోవడంతో పాటు సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు.