MLG: ములుగు సమీపంలోని తోపుకుంట వద్ద గణేశ్ నిమజ్జనాలు ప్రారంభమయ్యాయి. చిన్న విగ్రహాలను భక్తులు తరలించి నిమజ్జనం చేస్తున్నారు. మధ్యాహ్నం తర్వాత భారీ విగ్రహాలు రానున్నాయి. భక్తుల భద్రత కోసం తోపుకుంట వద్ద బారికేడ్లు, లైటింగ్ ఏర్పాటు చేశారు. పోలీసులు బందోబస్తు నిర్వహిస్తుండగా మున్సిపల్, ఎన్పీడీసీఎల్, హెల్త్ అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
తెలంగాణ
VIDEO: ములుగులో మొదలైన గణేశ్ నిమజ్జనాలు


