NDL: పగిడ్యాల మండలం లక్ష్మాపురం బాట నుంచి 15 కీ.మీ N. గణపురం వరకు రూ 1.39 కోట్ల వ్యయంతో నూతన బీటీ రోడ్డు కు ఎమ్మెల్యే గిత్త జయసూర్య ఇవాళ భూమి పూజ చేశారు. అనంతరం పారతో మట్టిని తవ్వారు. గ్రామీణ ప్రాంతాల్లో రహదారి సౌకర్యాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. కార్యక్రమంలో భారీగా ప్రజలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
బీటీ రోడ్డుకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే


