హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలి: సుజాత

W.G: అంగన్వాడీ చిన్నారులకు నాణ్యమైన పోషకాహారం అందించాలని ICDS సూపర్‌వైజర్ ఎం. సుజాత సూచించారు. బుధవారం పెంటపాడు-1 అంగన్వాడీ కేంద్రంలో పోషకాహార అవగాహన సదస్సు జరిగింది. గర్భిణులు, బాలింతలకు రోజూ పాలు, గుడ్లు, చిక్కీలు ఇవ్వాలన్నారు. దీనివల్ల ఆరోగ్య వంతమైన శిశువులు జన్మిస్తారన్నారు. మూడేళ్లు నిండిన పిల్లలను కేంద్రాల్లో చేర్పించాలని కోరారు.