హైదరాబాద్: 28°C
తెలంగాణ

పరిగిలో పల్లె పల్లెన వెలసిన బెల్ట్ షాపులు!

VKB: పరిగిలో బెల్ట్ దుకాణాలు విచ్చలవిడిగా వెలిశాయి. తాగేందుకు నీళ్లు లేని ఊళ్లున్నా, మద్యం దొరకని పల్లె లేదన్న విమర్శలు వస్తున్నాయి. వ్యాపారులు సిండికేట్‌గా పల్లెలకు ఆటోల్లో మద్యం తరలిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ఉదయం నుంచే మందుబాబులు మత్తులో ఊగుతూ కుటుంబాలు ఛిన్నాభిన్నం అవుతున్నా.. ఎక్సైజ్ శాఖ పట్టించుకోవడం లేదని ప్రజలు మండిపడుతున్నారు.