హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ట్యాంక్ బండ్‌పై చాకలి ఐలమ్మ విగ్రహం ఏర్పాటు చేయాలి'

NLG: చిట్యాల మండలం వెలిమినేడు గ్రామానికి చెందిన రజక సంఘం అధ్యక్షుడు గోలి కిష్టయ్య, ట్యాంక్ బండ్ పై చాకలి ఐలమ్మ విగ్రహాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని ప్రజా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎందరో మహానుభావుల విగ్రహాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం, ఐలమ్మ విగ్రహ ఏర్పాటులో అలసత్వం వహించడం సరికాదని ఆయన హితవు పలికారు. ఆమె సేవలను గుర్తించి విగ్రహం ఏర్పాటు చేయాలన్నారు.