హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: మంత్రి

HNK: ఎల్కతుర్తి మండలంలోని చింతలపల్లి, దామెర గ్రామాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం పర్యటించారు. ఇటీవల మృతి చెందిన కుటుంబాలను పరామర్శించారు. అనంతరం గ్రామస్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పేదలందరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని, ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరిస్తామని మంత్రి తెలిపారు.