SKLM: ఆమదాలవలసలో ఉన్న రైల్వేస్టేషన్‌లో ఇవాళ శక్తి యాప్‌పై ప్రయాణికులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. శక్తి టీమ్ ఇన్‌ఛార్జ్ టి. అమ్మాజీ మాట్లాడుతూ.. ఫోన్‌లో శక్తి యాప్ ఉంటే మహిళలు, ప్రయాణికులు మరింత సురక్షితంగా ఉండవచ్చని తెలిపారు. సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'సైబర్ మోసాలు పట్ల అప్రమత్తంగా ఉండాలి'


