కోనసీమ: ఆలమూరులో తమ న్యాయమైన కోరికలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వీఆర్ఏలు చేపట్టిన నిరవధిక సమ్మె బుధవారం 8వ రోజుకు చేరింది. మండల అధ్యక్షుడు తాతపూడి ఇస్సాకు ఆధ్వర్యంలో జోరువానలో స్థానిక పెద్ద కాలువలో అర్ధనగ్న జల దీక్ష చేపట్టారు. తెలంగాణ తరహా పే స్కేల్ అమలు, అర్హులకు పదోన్నతులు, మృతిచెందిన వీఆర్ఏ కుటుంబాల్లో ఒకరికి కారుణ్య నియామకం కల్పించాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: వీఆర్ఏల అర్ధనగ్న జల దీక్ష


