హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మంత్రి రాంప్రసాద్ ప్రజాదర్బార్.. వినతుల స్వీకరణ

అన్నమయ్య: తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రజాదర్బార్ నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలు, వినతులను స్వీకరించిన మంత్రి.. సంబంధిత అధికారులతో మాట్లాడి సత్వర పరిష్కారం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజల సమస్యలను ప్రాధాన్యతతో పరిష్కరించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు.