SDPT: బెజ్జంకి మండలం కల్లేపల్లి గ్రామంలో ‘స్వచ్ఛతా హి సేవా-2026’ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. సర్పంచ్ బిగుల్లా మోహన్ ఆధ్వర్యంలో వీధులు, మురుగు కాల్వల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించారు. గ్రామ ప్రజలకు పరిశుభ్రత ప్రాధాన్యంపై అవగాహన కల్పించారు. కార్యదర్శి ఆకుల రాకేష్ మాట్లాడుతూ.. పరిశుభ్రమైన గ్రామ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.
తెలంగాణ
కల్లేపల్లిలో పారిశుద్ధ్య కార్యక్రమం


