హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పాఠశాలను తనిఖీ చేసిన డీఈవో

ATP: గుత్తి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను డీఈవో అయుబ్ హుస్సేన్ ఆకస్మికంగా తనిఖీ చేసి, పాఠశాలలోని పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి, విద్యార్థులు, ఉపాధ్యాయులతో మాట్లాడారు. పదో తరగతి పరీక్షా ఫలితాలలో శతశాతం ఫలితాలు సాధించేలా కృషి చేయాలని HM సుంకన్నను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో రవి నాయక్ పాల్గొన్నారు.