హైదరాబాద్: 28°C
తెలంగాణ

మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి

KNR: సైదాపూర్ మండలంలోని దుద్దెనపల్లి, సైదాపూర్, సోమారంల్లో నేడు మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. ఇటీవల మృతి చెందిన పలువురి నివాసాలకు వెళ్లి, వారి చిత్రపటాలకు నివాళులర్పించారు. మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కష్టకాలంలో ఉన్న కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, అన్ని సహాయ సౌకర్యాలు అందిస్తామన్నారు.