హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ట్రాఫిక్ స్టేషన్‌లో ఎస్పీ ఆకస్మిక తనిఖీ

నంద్యాల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఆకస్మికంగా బుధవారం తనిఖీ చేశారు. రికార్డులు, ప్రమాద కేసుల దర్యాప్తు, డ్యూటీ రోస్టర్లను పరిశీలించారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు.