MDK: తూప్రాన్ పట్టణంలోని శబరి సూపర్ మార్ట్‌లో మంగళవారం రాత్రి చోరీ జరిగినట్లు పోలీసులు తెలిపారు. నర్సాపూర్ చౌరస్తా సమీపంలోని శబరి సూపర్ మార్ట్ వెనుక వైపు షట్టర్ తొలగించి దుండగులు అందులోకి ప్రవేశించారని పోలీసులు వెల్లడించారు. సూపర్ మార్ట్‌లో ఉన్న రూ. 40 వేల నగదు, సామాగ్రి చోరీ చేసినట్లు పేర్కొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
'సూపర్ మార్ట్‌లో చోరీ'


