అన్నమయ్య: జిల్లాలో బుధవారం ఉదయం నుంచి పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురుస్తోంది. దీంతో తీవ్ర ఎండలతో ఇబ్బందులు పడిన ప్రజలకు, రైతులకు ఉపశమనం లభించింది. వర్షాలతో భూమిలో తేమశాతం పెరగడంతో పంటలు బాగా పండే అవకాశం ఉందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వర్షపు నీటితో చెరువులు, కుంటల్లో నీటి మట్టం పెరిగే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో మోస్తరు వర్షంజ.. ప్రజలకు ఉపశమనం!


