హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విప్పర్లపల్లిలో వీధి కుక్కల బీభత్సం

PLD: రొంపిచర్ల మండలం విప్పర్లపల్లిలో వీధి కుక్కలు బీభత్సం సృష్టించాయి. బుధవారం ఉదయాన్నే 10 మందిని కరిచినట్లు గ్రామస్తులు తెలిపారు. కుక్క కాటుకు గురైన వారంతా ఆసుపత్రులకు పరుగులు తీశారు. బయట ప్రాంతం నుంచి సుమారు 30 కుక్కలను గ్రామంలో వదిలేశారని ఆరోపించారు. కుక్కల బెడద నుంచి రక్షించాలని అధికారులను గ్రామస్తులు కోరుతున్నారు.