MHBD: ఉమ్మడి వరంగల్ మామునూర్ ఎయిర్ పోర్టుకు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని జాతీయ మాల మహానాడు నెల్లికుదురు మండల అధ్యక్షుడు కారం ప్రశాంత్ అన్నారు. ఈ మేరకు స్థానిక అంబేద్కర్ సెంటర్‌లో వినతిపత్రం ప్రదర్శించి, స్థానిక తహసీల్దార్ చందా నరేష్, ఎంపీడీవో కుమార్‌లకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
'మామునూరు ఎయిర్ పోర్టుకు అంబేద్కర్ పేరు పెట్టాలి'


