హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

227 కుటుంబాలకు చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే

ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని ముత్తవరపు కళ్యాణ మండపంలో బుధవారం ఉదయం 227 మంది లబ్ధిదారులకు రూ.1.08 కోట్ల సీఎం సహాయనిధి చెక్కులను మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పంపిణీ చేశారు. ఆపదలో ఉన్న కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తూ, వారి కష్టాల్లో ప్రభుత్వం అండగా నిలుస్తుందని అన్నారు.