హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: వాడపల్లి ఆలయంలో డిప్యూటీ కమిషనర్ తనిఖీలు

కోనసీమ: ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఇవాళ అన్నదాన విభాగాన్ని ఆలయ డిప్యూటీ కమిషనర్ చక్రధరరావు తనిఖీ చేశారు. భక్తులకు అందిస్తున్న అన్నప్రసాదం నాణ్యత, వంటశాల పరిశుభ్రత, ఆహార పదార్థాల నిల్వ తదితర అంశాలను పరిశీలించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్నదాన కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని సిబ్బందికి సూచించారు.