హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: నీరులేక పేరుకుపోయిన వినాయక విగ్రహాలు

KRNL: కర్నూలు నగరంలో వినాయక నిమజ్జనం పూర్తయినా కేసీ కాలువలో నీరు లేక భారీ విగ్రహాలు నీటిపైనే ఉండిపోయాయి. వినాయక ఘాట్ వద్ద అధిక సంఖ్యలో విగ్రహాలు నిమజ్జనం చేయడంతో ఒకదానిపై ఒకటి పేరుకుపోయాయి. ఇనుప కడ్డీల కోసం కొందరు విగ్రహాలను పక్కకు జరుపుతున్నారు. చిన్న విగ్రహాలనే ఏర్పాటు చేయాలని అధికారులు సూచించినా ఫలితం లేకపోయింది.