హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రంగనాయకుల ఆలయ అభివృద్ధి పనులు ప్రారంభం

NLR: ఉదయగిరి పట్టణంలోని రాయల కాలం నాటి శ్రీ రంగనాయకుల ఆలయ ఆధునికీకరణ, అభివృద్ధి పనులు పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ప్రారంభమయ్యాయి. తొలి విడతలో ఆలయ ప్రాకారం చుట్టూ మండపం నిర్మాణ పనులు చేపడుతున్నట్లు పురావస్తు శాఖ అధికారి యశ్వంత్ రెడ్డి తెలిపారు. ఆలయ చారిత్రక ప్రాధాన్యతను కాపాడుతూ అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.