NRML: 11వ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా జిల్లా ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 23న దిలావర్‌పూర్ మండలంలోని సిర్గాపూర్ గ్రామం ఉచిత వృద్ధాప్య ఆరోగ్య శిబిరం నిర్వహించనున్నారు. వృద్ధులు, ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి ఉచిత పరీక్షలు, వైద్యుల సలహాలు, ఆయుర్వేద–హోమియోపతి వైద్యం, మందుల పంపిణీ చేయనున్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.
తెలంగాణ
ఉచిత ఆరోగ్య శిబిరం


