హైదరాబాద్: 28°C
తెలంగాణ

భారీగా గంజాయి పంట స్వాధీనం

ADB: జిల్లాలో కొందరు వ్యక్తులు అంతర పంటలుగా గంజాయి సాగు చేస్తున్నారు. మావల మండలం పొట్టంలొద్ది గ్రామంలో గంజాయి సాగు చేస్తున్నారనే పక్కసమాచారంతో పోలీసులు దాడి చేశారు. సుమారు రూ. 38 లక్షల విలువైన పంటను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు సర్పంచ్ భర్త గంగారం పటేల్ ను అదుపులోకి తీసుకున్నారు. ఇలాంటి అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.