హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యారంగ పరిరక్షణకు ఏఐఎస్ఎఫ్ పిలుపు

RR: షాద్‌నగర్‌లో జరిగిన AISF సభ్యత్వ నమోదు కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పవన్ చౌహాన్ మాట్లాడారు. ప్రభుత్వ విద్యను కాపాడుకోవాల్సిన బాధ్యత విద్యార్థులపైనే ఉందన్నారు. ప్రైవేట్ ఫీజుల నియంత్రణ, స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదల, విద్యాశాఖకు ప్రత్యేక మంత్రి నియామకం కోసం విద్యార్థులు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలన్నారు.