హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఓ వైపు నీటి కష్టాలు.. మరోవైపు వృథా!

ప్రకాశం: గిద్దలూరు మున్సిపాలిటీ పరిధిలో నటరాజ్ థియేటర్ మార్గంలోని పీర్ల చాపిడి వద్ద ప్రధాన వాటర్ పైపులైన్ లీకేజీ కావడంతో నీరు వృథాగా పోతోంది. పట్టణంలో తీవ్ర తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. కానీ మాత్రం అధికారులు లీకేజీని పట్టించుకోవట్లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మరమ్మతులు చేపట్టాలని వారు కోరుతున్నారు.