హైదరాబాద్: 28°C
తెలంగాణ

'మాదకద్రవ్యాల వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలి'

HYD: మలక్‌పేట్‌లో మాదకద్రవ్యాల వ్యాపారం నిర్వహిస్తున్న వారిపై పోలీసులు కఠినచర్యలు తీసుకోవాలని MIM ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా డిమాండ్ చేశారు. యువతను నాశనం చేస్తున్న డ్రగ్స్ మాఫియాపై ప్రత్యేక దృష్టి సారించి కట్టడి చేయాలని ఆయన కోరారు. పేదలను ఇబ్బంది పెట్టడం కంటే సమాజానికి హాని కలిగిస్తున్న మాదకద్రవ్యాల విక్రేతలపై చర్యలు తీసుకోవడం అవసరమని పేర్కొన్నారు.