హైదరాబాద్: 28°C
తెలంగాణ

డిగ్రీ కళాశాలలో దరఖాస్తులకు ఆహ్వానం

NZB: ఆర్మూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్‌కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ వేణుగోపాలస్వామి తెలిపారు. బీఏ, బీకాం, బీఎస్సీ ఫిజికల్ సైన్స్ విభాగాలలో సీట్లు ఖాళీగా ఉన్నట్లు వివరించారు. ఆసక్తిగల అభ్యర్థులు తమ నిజ పత్రాలు, జిరాక్స్ పత్రాలతో ఈనెల 24, 25 తేదీలలో కళాశాలకు నేరుగా హాజరై ప్రవేశాలు పొందాలన్నారు.