హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: అరుదైన దృశ్యం.. ముళ్లకంపలపై పూజారి

అనంతపురం జిల్లా బెలుగుప్ప తండాలో నిర్వహిస్తున్న మారెమ్మ జాతరలో అరుదైన దృశ్యం ఆకట్టుకుంది. జాతరలో భాగంగా పూజారి ముళ్లకంపలపై విన్యాసాలు చేశారు. ముళ్లకంపలపై ఉన్నప్పటికీ ఆయనకు ఎలాంటి రక్తస్రావం కాకపోవడం విశేషం. ఈ సంప్రదాయ కార్యక్రమాన్ని తిలకించేందుకు భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. దీంతో జాతర ప్రాంగణంలో సందడి నెలకొంది.