హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆయిల్‌ఫెడ్ కర్మాగారంలో మంత్రి ఆకస్మిక తనిఖీ..

BDK: దమ్మపేట మండలం అప్పారావుపేటలోని టీజీ ఆయిల్‌ఫెడ్ కర్మాగారాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కర్మాగారంలో ఆయిల్‌పామ్ గెలల రాక, క్రషింగ్ ప్రక్రియ, ఉత్పత్తి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఇబ్బందులు లేకుండా గెలల సేకరణ, ప్రాసెసింగ్ సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.