హైదరాబాద్: 28°C
తెలంగాణ

కబడ్డీ పోటీల్లో సత్తా చాటాలి

MDK: రాష్ట్రస్థాయి జూనియర్స్ కబడ్డీ పోటీల్లో ఉమ్మడి మెదక్ జిల్లా క్రీడాకారులు ప్రతిభ చాటాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సూచించారు. వేములవాడలో ఈ నెల 26, 27, 28 తేదీల్లో జరిగే పోటీలకు సిద్ధమవుతున్న జిల్లా జట్టు శిక్షణ శిబిరాన్ని మంగళవారం సందర్శించారు. క్రీడాకారుల ఫిట్‌నెస్, ప్రాక్టీస్‌ను పరిశీలించారు. విజేతలుగా నిలిచి జిల్లాకు పేరు తేవాలని ఆకాంక్షించారు.