హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఫీజుల వివరాలు నమోదు చేయాలి'

SRD: సంగారెడ్డి జిల్లాలోని అన్ని ప్రైవేటు పాఠశాలలు ఫీజుల వివరాలను ఆన్లైన్లో తప్పనిసరిగా నమోదు చేయాలని జిల్లా విద్యాధికారి రోహిణి తెలిపారు. ఫీజుల వివరాలు ఆన్లైన్లో సమర్పించని పాఠశాలలకు నోటీసులు జారీ చేస్తామని చెప్పారు. విద్యాశాఖ నిబంధనలను అన్ని ప్రైవేటు పాఠశాలలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.