హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎడతెరపి లేని వర్షం.. తప్పిన ప్రమాదం

పార్వతీపురంలో పెను ప్రమాదం తప్పింది. ఎడతెరపి లేని వర్షాల కారణంగా గురుకుల జూనియర్ కళాశాల తరగతి గదిలోని స్లాబ్ పెచ్చులు ఊడిపడ్డాయి. అయితే, ఆ సమయంలో గదిలో విద్యార్థులు లేకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఎలాంటి ప్రమాదం జరగకముందే కళాశాలకు మరమ్మతులు చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.