హైదరాబాద్: 28°C
తెలంగాణ

లక్నాపూర్ ప్రాజెక్టులో విహరించిన ఎమ్మెల్యే

VKB: పరిగి నియోజకవర్గంలోని లక్నాపూర్ ప్రాజెక్ట్‌లో పరిగి MLA రామ్మోహన్ రెడ్డి సహచరులతో కలిసి బుధవారం బోటింగ్ నిర్వహించారు. ఇప్పుడిప్పుడే పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతున్న లక్నాపూర్ ప్రాజెక్టు మరింత అభివృద్ధి చెందితే స్థానికులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుందని MLA ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే 2 ఏళ్లలో మరింత అభివృద్ధి చేస్తామన్నారు.