హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: చెత్త, దుర్గంధంతో నిండిపోయిన పలు వార్డ్‌లు

ASF: కాగజ్ నగర్ పట్టణంలోని పలు వార్డుల్లో చెత్త పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాపువాడ ప్రధాన రహదారి చెత్త కుప్పలతో నిండిపోయి ఉండడంతో దోమలు వృద్ధి చెంది వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని కాలనీవాసులు ఆందోళన చెందుతున్నారు. సకాలంలో చెత్త తొలగించి పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు.