హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'వర్షాలతో సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి'

PPM: వర్షాల నేపథ్యంలో సీజనల్‌ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్‌వో డా. విజయలక్ష్మి సూచించారు. ఇళ్ల పరిసరాల్లో వర్షపు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవడంతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. డెంగ్యూ, మలేరియా నివారణకు కాచి చల్లార్చిన నీటినే తాగాలని, ఈగలు వాలిన లేదా నిల్వ ఉంచిన ఆహారాన్ని తీసుకోవద్దని సూచించారు.