వాయుగుండం, వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో ఆంధ్రా యూనివర్సిటీలో ఇవాళ తరగతులను రద్దు చేశారు. సెప్టెంబర్ 23న విద్యార్థులు యూనివర్సిటీకి రావద్దని రిజిస్ట్రార్ సూచించారు. ఈ సమాచారాన్ని విద్యార్థులకు తెలియజేయాలని ప్రిన్సిపల్స్, హెచ్‌వోడీలను ఆదేశించారు. రద్దైన తరగతులను తదుపరి తేదీలో నిర్వహిస్తామని, విద్యార్థులు బయటకు రావద్దని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
వాయుగుండం ప్రభావంతో AUలో తరగతులు రద్దు


