VKB: వినాయక నిమజ్జనంలో DJ ల వాడకాన్ని పూర్తిగా నిషేధించినట్లు టౌన్ CI రఘుకుమార్ తెలిపారు. సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ వేడుకలు జరుపుకోవాలని పిలుపునిచ్చారు. మ.2గంటల లోపు DJలు లేకుండా సంప్రదాయబద్ధంగా కొత్త గంజ్ చేరుకునే వినాయకులకు రూ.10వేల ప్రోత్సాహక బహుమతి అందజేస్తామన్నారు. నిమజ్జనంలో శాంతిభద్రతల రక్షణకు నిర్వాహకులు పోలీసులకు సహకరించాలన్నారు.
తెలంగాణ
DJ లేకుండా నిమజ్జనానికి వస్తే 10వేల నజరానా: టౌన్ సీఐ


