హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వరి సాగుకు వాతావరణం అనుకూలం

VSP: సుబ్బవరం మండలంలో ఎల్‌నినో ప్రభావంతో వరి నాట్లు అంతంత మాత్రంగానే పడ్డాయి. మండలం మొత్తం మీద 1409 హెక్టార్లలో వరినాట్లు వేయాల్సి ఉండగా వర్షాలు లేక బోర్లు, నీరు అందుబాటులో ఉన్న చోట ఇప్పటివరకు 210 హెక్టార్లలో నాట్లు పడ్డాయని సబ్బవరం మండల వ్యవసాయాధికారి పి. సత్యనారాయణ తెలిపారు. ప్రస్తుతం తుపాను కారణంగా పడుతున్న వర్షాలు నాట్లు వేసిన పంటకు అనుకూలంగా ఉందన్నారు.